Advertisement
తెలుగువారందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైన తరువాత తెలుగువారు జరుపుకునే తొలి పండుగ సంక్రాంతి. రంగవల్లులతో, పాడిపంటలతో, గంగిరెద్దులు హరిదాసుల సందడితో, పిల్లాపాపలతో ప్రతి తెలుగు ముంగిలిని ఆనందోత్సాహలతో నింపే పండుగ సంక్రాంతి. విదేశాల్లో ఉంటున్న మనలాంటి వారందరినీ ఆత్మీయంగా ఒక చోటకి చేర్చి తెలుగు తల్లి బిడ్డలంతా ఒకే కుటుంబం అనే సద్భావన కలిగిస్తున్న పండుగ సంక్రాంతి. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా "తెలుగుదేశం ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 న (శనివారం) "సంక్రాంతి సంబరాలు" జరగనున్నాయి.
ఆహ్లాదకర వాతావరణంలో జరిగే ఈ సంబరాలలో పాల్గొని ఆనందించవలసిందిగా ప్రతి తెలుగు కుటుంబానికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము.
అతిథులని అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల కార్యక్రమం, రాఫెల్, చిన్నారులకి భోగిపళ్లు, విందుభోజనం, షాపింగ్ చేసేందుకు అనేక స్టాల్ల్స్ వంటి ఆకర్షణలు కలవు!!
అతిథులందరూ తెలుగుదనం ఉట్టిపడేలా మన సంప్రదాయ వస్త్రధారణలో రాగలరు.
Please RSVP using link - bit.ly/2025TDASankranthi
This will help us in making catering arrangements right.
Note: Event starts from 5.00 PM Onwards
Venue Details:
Harvey Lowe Pavilion, Doran Dr, Castle Hill NSW 2154
Event Address/Google Maps: https://g.co/kgs/oB1nu8F
అంబరాన్ని తాకే సంబరానికి తెలుగుతల్లి ప్రియపుత్రులందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తూ.
మీ ఆగమనాభిలాషులు, మీ తెలుగుదేశం ఆస్ట్రేలియా కుటుంబం 🙏
Advertisement
Event Venue & Nearby Stays
Harvey Lowe Pavilion, Pavilion Theatre, Castle Hill NSW 2154, Australia,Sydney, Australia, Castle Hill